VIDEO: అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు: డీఎం
MDK: ఆర్టీసీ డిపో పరిధిలో అన్ని రూట్లలో ఇవాళ యథావిథిగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని డిపో మేనేజర్ సురేఖ తెలిపారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో రెండవ రోజు పోలీస్, రెవెన్యూ సహకారంతో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి డిపో పరిధిలోని అన్ని రోడ్లలో యథావిథిగా బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.