'కల్వర్టు నిర్మాణం చేపట్టాలి'

అల్లూరి: అనంతగిరి మండలం తడిగుడ జలపాతానికి వెళ్లే కల్వర్టు నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కురుస్తున్న వర్షాలకు నిర్మాణ దశలో ఉన్న కల్వర్టు కొంతమేర కొట్టుకుపోయింది. దీంతో జలపాతాన్ని వీక్షించేందుకు పర్యటకులు రాకపోకల సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి కల్వర్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు.