VIDEO: ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కలెక్టర్‌కు వినతి
BPT: వేటపాలెం రైల్వే స్టేషన్‌లో అందరికీ అందుబాటులో ఉండేలా నూతన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సోమవారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌కు పీజీఆర్ఎస్‌లో వినతిపత్రం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బాలకృష్ణ అందజేశారు. ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు బ్రిడ్జి దూరంగా ఉండటంతో గత్యంతరం లేక పట్టాలు దాటుతున్నారని ఆయన తెలిపారు.