రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

చిత్తూరు: పలమనేరు నుండి నాగిరెడ్డిపల్లికి వెళ్తుండగా ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొని అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. మృతుడు నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జీవరత్నంగా గుర్తించారు. జివరత్నం భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.