రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి
CTR: పుత్తూరులో రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. వడమాల పేట మండలం ఎస్‌బీఐ పురానికి చెందిన గోపి కుమారుడు హరి (27) పుత్తూరులో పనులు చూసుకుని స్వగ్రామం వెళ్లేందుకు బయలుదేరాడు. అదే సమయంలో కార్వేటి నగరానికి చెందిన రవి (45) పుత్తూరులోని పెళ్లి సత్రానికి వెళ్తుండగా రెండు బైకులు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.