కాలితో దీపాన్ని తన్నిన కాకి.. నాలుగు తాటాకు ఇళ్లు బూడిద..!

కాలితో దీపాన్ని తన్నిన కాకి.. నాలుగు తాటాకు ఇళ్లు బూడిద..!

VZM: గరివిడి మండలంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. మండలంలోని కోనూరులో ఓ ఇంటి దాబాపై కార్తీక మాసం సందర్భంగా దీపం వెలిగించి  పెట్టారు. ఆ దీపాన్ని ఓ కాకి కాలితో తన్నగా అది పక్కనే ఉన్న ఓ తాటాకు ఇంటిపై పడింది. దీంతో ఒక్కసారిగా ఇంటిపై మంటలు చెలరేగి, వరుసగా ఉన్న నాలుగు తాటాకు ఇళ్ల పూర్తిగా దగ్థమైయ్యాయి. ఈ ఘటనలో మొత్తం రూ.4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు అంచనా వేశారు.