CID విచారణకు విజయ్ దేవరకొండ
హీరో విజయ్ దేవరకొండ, నటుడు ప్రకాష్ రాజ్ హైదరాబాద్‌లోని సీఐడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వీరిద్దరిని సీఐడీ విచారించనుంది. 10 రోజుల క్రితమే వారికి సీఐడీ నోటీసులు అందజేసింది. ఈ నేపథ్యంలో విజయ్, ప్రకాష్ రాజ్ ఇప్పుడు విచారణకు హాజరయ్యారు.