కానిస్టేబుళ్లను అభినందించిన ఎస్పీ
VZM: జిల్లా పోలీసు శాఖలో సివిల్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తూ ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన ఇద్దరు కానిస్టేబుళ్లు జిల్లా ఎస్పీని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయం సాధించిన వారిని ఎస్పీ అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పోలీసు శాఖలో వివిధ రకాల విధులను సమర్ధవంతంగా పనిచేశారని కొనియాడారు.