చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
NLR: చేజర్ల మండలం ఆదురుపల్లి గురుకుల పాఠశాల సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న మహేంద్ర థార్ వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, వాహనంలో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.