విజయ్‌పై ఐశ్వర్య రాజేష్ ప్రశంసలు
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌పై హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రశంసలు కురిపించింది. యువతకు ఆయన ఒక గొప్ప రోల్ మోడల్ అని పేర్కొంది. 'విజయ్ ఎవరి గురించి తప్పుగా మాట్లాడరు. తన పని తాను చేసుకుంటూ వెళ్తారు. కానీ, బయట చాలామంది ఆయన గురించి విమర్శలు చేస్తుంటారు. అయినా సరే, ఆయన అవేమీ పట్టించుకోరు. అభిమానులే ఆయనకు ప్రపంచం' అని చెప్పుకొచ్చింది.