నేటితో ముగియనున్న భవానీ దీక్షలు
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కోలాహలం ఇవాళ్టితో ముగియనుంది. చివరి రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. 'జై భవానీ' నినాదాలతో దుర్గమ్మ సన్నిధి మార్మోగుతోంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇవాళ సాయంత్రంతో విరమణ ఘట్టం పూర్తి కానుంది. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి.