కోమరోలులో ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ

ప్రకాశం జిల్లా కోమరోలులోని ఆర్.సి.యం చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో మూడవ బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా 25 మందికి జర్మనీలోని కొల్ఫీన్ సంస్థ సహకారంతో ఫాదర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు మేత్రాసణ బిషప్ యం.డి. ప్రకాశం చేతుల మీదుగా ఉచిత కుట్టు మిషన్లను శనివారం పంపిణీ చేశారు.