'పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి'
MNCL: బెల్లంపల్లి మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ పిలుపునిచ్చారు. గురువారం కన్నాల రైతు వేదికలో సర్పంచులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలాన్ని జిల్లాలోనే ఆదర్శంగా నిలపాలన్నారు. పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.