అంగన్వాడీ కార్యకర్త మృతి
ASR: చింతపల్లి(M) తాళ్ళకోట మినీ అంగన్వాడీ కార్యకర్త సాగిన రాములమ్మ మృతి చెందారు. శుక్రవారం రాములమ్మ విధి నిర్వహణలో ఉండగా కడుపునొప్పిలొ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో, వైద్యుల సూచనల మేరకు అంబులెన్సులో నర్సీపట్నం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.