గడ్డిపాడులో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
GNTR: గుంటూరు 57వ డివిజన్ గడ్డిపాడులో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నగర వైసీపీ అధ్యక్షురాలు నూరీ ఫాతిమా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఆశయాలు, సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.