బృందావన్‌లో పర్యటించనున్న రాష్ట్రపతి ముర్ము
యూపీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ బృందావన్‌లోని రామకృష్ణ మిషన్ సేవాశ్రమంలో 'ఆంకాలజీ బ్లాక్'ను ప్రారంభించనున్నారు. అనంతరం నీల్ కరోరీ బాబా సమాధిని సందర్శించి నివాళులర్పించనున్నారు. నిన్న అయోధ్య రామయ్యను దర్శించుకున్న ఆమె, శ్రీరాముని ఆశీస్సులతో 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.