ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలి: జడ్జి

ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలి: జడ్జి

W.G: వచ్చే నెల 13న జరగనున్న జాతీయ 'లోక్ అదాలత్' ఎక్కువ కేసులు రాజీ చేసి కక్షిదారులకు న్యాయం చేయడంలో న్యాయవాదులు భాగస్వామ్యం కావాలని నరసాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి వాసంతి అన్నారు. సోమవారం నరసాపురం కోర్టులో న్యాయవాదులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. కక్షిదారులకు తక్కువ సమయంలో సమన్యాయం అందించడానికి న్యాయవాదులు పనిచేయాలన్నారు.