గంట్యాడ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
VZM: గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు.. అక్కడ విద్యార్థులకు బోధన చేయడమే కాకుండా వారితో పాటు కంచం పట్టుకుని లైన్లో నిల్చున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అలాగే విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు.