'ఈనెల 14 లోగా గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేయాలి'

VZM: కొత్తవలస మండల పరిషత్ కార్యాలయంలో స్వామిత్వ గ్రౌండ్ ట్రూతింగ్ కార్యక్రమం ఈనెల 14లోపు పూర్తి చేయాలని డిప్యూటీ ఎంపీడీవో శ్రీదేవి అన్నారు. ఈ మేరకు గురువారం మండల సచివాలయం కార్యదర్శులకు సూచనలు చేశారు. గ్రామాల్లో ఐవీఆర్ ఎస్,పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. క్లాప్ మిత్ర ఉద్యోగుల జీతాలు బిల్లులు వేగవంతం చేసి ఆయా పంచాయతీల సిబ్బంది చెల్లించేలా చూడాలని కార్యదర్శులను కోరారు.