పూల బొకేలు వద్దు బ్లాంకెట్లు ఇవ్వండి: సీతక్క
MLG: పూల బొకేలు వద్దు, బ్లాంకెట్లు ఇవ్వాలని, చలి నుంచి పేద ప్రజలను రక్షించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. సచివాలయంలో సెర్ప్ సీఈవో దేవరాజన్ ఆధ్వర్యంలో పలువురు సీతక్కకు బొకేతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీతక్క మాట్లాడుతూ..పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. అందుకుగాను పూల బొకేలు కాకుండా శాలువలు, దుప్పట్లు ఇవ్వాలని సూచించారు.