వేడిగాలులపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వేడిగాలులపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ADB: జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం సూచించారు. సాధారణ స్థాయికి మించి 1.5°C నుంచి 3.5°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని తెలిపారు. జిల్లాలో వచ్చే వారం రోజుల పాటు వేడి గాలులు (హీట్‌వేవ్) ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.