భూంపల్లిలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం
SDPT: భూంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం మెగా హెల్త్ క్యాంప్‌ను ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ప్రారంభించారు. గ్రామీణ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వైద్యులు నిర్లక్ష్యం వీడి ప్రజల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జన్నారెడ్డి, మెడికల్ ఆఫీసర్ తదితరులున్నారు.