సామాజికమ్ - 2025 అవార్డు దక్కించుకున్న జేడీ ఫౌండేషన్

VSP: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పలు సంఘసేవకులకు ఆదివారం అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఇందులో భాగంగా సీబీఐ మాజీ జేడీ వివి.లక్ష్మీనారాయణకు సంబంధించిన జేడీ ఫౌండేషన్ సామాజికమ్ - 2025 అవార్డు పొందింది. ఈ అవార్డును ఫౌండేషన్ మెంబర్లు నిర్వాహకులు చేతుల మీదుగా అందుకున్నారు. జేడీ ఫౌండేషన్ సమాజంలో సేవా కార్యక్రమాలు చేస్తోంది.