నూజివీడు టౌన్ మున్సిపాలిటీ సమీక్ష సమావేశం
ELR: నూజివీడు టౌన్ మున్సిపాలిటీ సమీక్ష సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి ఇవాళ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు హాజరై పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు కల్పించడానికి చేసిన పనులు, అభివృద్ధి పనులు వివరించారు. పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.