ఇంటీరియర్ డిజైనింగ్ పేరిట మోసాలు.. జాగ్రత్త!
MDCL: ఉప్పల్ ప్రాంతంలో ఇంటీరియర్ డిజైనింగ్ పేరిట మోసాలు పెరుగుతున్నాయి. నకిలీ సంస్థలు తక్కువ ఖర్చుతో మంచి పనులు చేస్తామని చెప్పి ముందస్తు డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నాయి. తాజాగా నారాయణ అనే వ్యక్తి రూ. 24,534 కోల్పోయాడు. పనులు చేయకుండా డబ్బుతో పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.