గోదావరిలో రెండు మృతదేహాలు లభ్యం
TG: నిర్మల్ జిల్లా బాసర దగ్గర గోదావరి నదిలో మృతదేహాలు కలకలం రేపాయి. బాసర బ్రిడ్జి కింద రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. గుర్తుపట్టని స్థితిలో మహిళ మృతదేహాం లభ్యమైంది. మరొకరు గాజులపేటకు చెందిన ఆకాష్(3)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.