సీటులోనే కుప్పకూలిన లారీ డ్రైవర్

సీటులోనే కుప్పకూలిన లారీ డ్రైవర్

కృష్ణా: లారీలో మృతదేహం కలకలం రేపిన ఘటన బాపులపాడు మండలం పెరికిడు జాతీయ రహదారిపై జరిగింది. ఏలూరు జిల్లా అప్పనవీడుకు చెందిన కొత్తూరు ప్రసాద్ అలియాస్ పండు(45) దీపక్ నెక్స్ట్ జెన్ ఫీడ్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లారీ డ్రైవర్ సీటులోనే ఆకస్మత్తుగా కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.