తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

అన్నమయ్య: కురబలకోట తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం ఉదయం 9గంటలకే జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీచేశారు. సిబ్బంది సకాలంలో విధులకు హాజరవుతున్నారా..? లేదా పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి, రెవెన్యూ సమస్యలపై ఆరాతీశారు. భూవివాదాలకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.