పిల్లల్ని కనడం వారి వ్యక్తిగత ఇష్టం: కేఏ పాల్

TG: హిందువులందరూ పిల్లల్ని కనండి అని ఆర్మూరు MLA రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. ఆర్మూరుకు చెందిన ఎమ్మెల్యే పిచ్చిపిచ్చిగా వాగాడని మండిపడ్డారు. నోరు విప్పితే మతాల మధ్య చిచ్చులు పెట్టడం తప్ప ఆయనకు మరో పని లేదని, ఇంకా పిల్లల్ని కంటే ఉద్యోగాలు ఇస్తారా అని ప్రశ్నించారు. పిల్లల్ని కనడం అనేది వారి వ్యక్తిగత ఇష్టమని పేర్కొన్నారు.