జాతీయ హాకీ పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు

NLG: పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగే జాతీయ జూనియర్ బాలుర హాకీ పోటీలకు నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన రావుల గణేష్, సింగం మధు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం తెలిపారు. రావుల గణేష్ తెలంగాణ హాకీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారని, వీరిద్దరూ రామన్నపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారని ఆయన అన్నారు.