VIDEO: ఘనంగా వెంకటేశ్వర స్వామి రథోత్సవం
SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున స్వామి వారి రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయ ప్రధాన అర్చకులు కాందాలయ రమణాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంలో ప్రతిష్టించారు.