పదో తరగతి పరీక్షల ముందు సరస్వతి పూజలు

పదో తరగతి పరీక్షల ముందు సరస్వతి పూజలు

BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం విద్యార్థులు సరస్వతి దేవి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో పరీక్షల్లో విజయవంతం కావాలని విద్యార్థులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.