VIDEO: అక్రమ మట్టి రవాణా.. టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు
PDPL: పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న టిప్పర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారని పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోకపోవడంతో విసుగు చెంది అడ్డుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.