పేలుడు ఘటన.. మరో వైద్యుడు మిస్సింగ్..?
ఎర్రకోటపేలుడు తర్వాత సీనియర్ రెసిడెంట్ డా.నిసార్ హసన్ కన్పించకుండా పోయినట్లు అధికారులు గుర్తించారు. గతంలో హసన్ కశ్మీర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసినట్లు తెలిపారు. ఆ సమయంలో అతడికి ఉగ్ర ముఠాలతో సంబంధాలున్నట్లు తేలడంతో 2023లో హసన్‌ను ఉద్యోగం నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ తొలగించారని చెప్పారు. ఆ తర్వాత అల్ ఫలాహ్‌లో చేరినట్లు పేర్కొన్నారు.