'రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి'
MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా కొత్తగా పట్టా పాస్ పుస్తకం వచ్చిన రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాజు నారాయణ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బీమా అమలు చేస్తున్న నేపథ్యంలో కొత్త పట్టా పాస్ పుస్తకం వచ్చిన రైతులు ఈ నెల 13లోగా తమ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పత్రాలతో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.