పేరుకే డ్రైవర్.. నెలకు రూ.1.2 లక్షల సంపాదన

పేరుకే డ్రైవర్.. నెలకు రూ.1.2 లక్షల సంపాదన

యూపీకి చెందిన హజ్రత్ కష్టపడితే సాధించలేనిది లేదని నిరూపించారు. ఢిల్లీలో కుట్టు కంపెనీలో పనిచేసే ఆయన, స్నేహితుడి సలహాతో ఉబర్ డ్రైవర్‌గా మారారు. రోజుకు 14 గంటలు శ్రమిస్తూ ఇప్పటివరకు 50 వేల ట్రిప్పులు పూర్తి చేశారు. నెలకు రూ.1.2L వరకు సంపాదిస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. యాప్ వాడటం తెలియని స్థాయి నుంచి ఈ స్థాయికి చేరిన హజ్రత్ పట్టుదలకు అందరూ ఫిదా అవుతున్నారు.