కలెక్టరేట్లో పార్కింగ్ షెడ్ కోసం వినతి
VKB: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద వాహనదారులకు పార్కింగ్లో షెడ్ లేకపోవడంతో వాహనాలు ఎండలో హీట్ ఎక్కుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి వికారాబాద్లో 30 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది. వాహనాలు తాకితే చేతులు కాలిపోయే పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులు దృష్టిలోకి తీసుకొని కలెక్టరేట్ వద్ద వాహనాల పార్కింగ్‌కు షెడ్ నిర్మించాలని కోరుతున్నారు.