కాలువలు లేక రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో సైడు కాలువలు లేక మురుగు నీరు రోడ్డుకు ఇరువైపులా ప్రవహిస్తుంది. దీంతో దోమలు, ఈగలు విజృంభించడంతో దుర్వాసన వెదజల్లుతుంది. ఈ మురుగు నీరు కుంపటి వెంబడి నివాసము ఉండే ఇండ్లు ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సైడ్ కాలువలు నిర్మించాలని కోరుతున్నారు.