మైన్స్ భూ సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

మైన్స్ భూ సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

KRNL: జొన్నగిరి గోల్డ్ మైన్స్‌కు సంబంధించిన పెండింగ్ భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని ఇవాళ కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. తుగ్గలి మండలంలోని మైన్స్‌ను సందర్శించి ప్లాంట్ పనితీరును సమగ్రంగా పరిశీలించారు. అనంతరం పరిశ్రమల శాఖ, APIIC అధికారులు, సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు.