పుట్టపర్తిలో మిన్నంటిన సీఎం జన్మదిన వేడుకలు

పుట్టపర్తిలో మిన్నంటిన సీఎం జన్మదిన వేడుకలు

సత్యసాయి: CM చంద్రబాబు 76వ జన్మదినం పురస్కరించుకుని పుట్టపర్తిలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. జిల్లా TDP అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో 76 కిలోల భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ వడ్డే వెంకట్, పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమప్ప, పల్లె రఘునాథ రెడ్డి పాల్గొన్నారు.