నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి
SRD: నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీఎన్జీవో ఆధ్వర్యంలో టీజీఐసి ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డికి బుధవారం వినతి పత్రం సమర్పించారు. నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ, కార్యదర్శి రవి పాల్గొన్నారు.