క్యూబా సంఘీభావ నిధికి విరాళాల సేకరణ

WNP: క్యూబా దేశ సంఘీభావ నిధికి గురువారం పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు హమాలీల నుంచి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మండ్ల రాజు మాట్లాడుతూ.. క్యూబా దేశాన్ని, కార్మికవర్గాన్ని అమెరికా ఇబ్బందులకు గురిచేస్తూ ఆదిపత్యం చేస్తుందని విమర్శించారు. క్యూబాకు సంఘీభావంగా ప్రపంచం మొత్తం బాసటగా నిలిచిందన్నారు.