అనుమతి లేని మందులు అమ్మితే చర్యలు: ఏడీఏ

అనుమతి లేని మందులు అమ్మితే చర్యలు: ఏడీఏ

 KRNL: అనుమతి లేని బయో ఉత్పత్తుల మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఏ మోహన్ విజయ్ కుమార్, ఏఓ ఉషారాణి హెచ్చరించారు. సోమవారం స్థానిక మండల వ్యవసాయ కార్యాలయంలో ఫెర్టిలైజర్స్, ఫెస్టిసీడ్స్ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మందులు విక్రయించాలని, అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.