ఓక్ ల్యాండ్ పాఠశాలలో సంబరాలు
VZM: అమరావతిని రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్ ఆమోదించడంతో విజయనగరం జిల్లా పూసపాటి రేగ, జమ్ములోని ఓక్ ల్యాండ్ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంబరాల్లో మునిగిపోయారు. జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు కరస్పాండెంట్ డా. చేపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకల్లో ప్రిన్సిపాల్ చేపా రవి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.