నక్కల కాలనీలో పోలీసుల 'కార్డెన్ సెర్చ్'

CTR: ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు కార్వేటి నగరం సీఐ హనుమంతప్ప సారధ్యంలో వెదురుకుప్పం ఎస్సై, సిబ్బందితో కలిసి నక్కల కాలనీలో 'కార్డెన్ సెర్చ్' నిర్వహించారు. ఈ మేరకు వారి వద్ద నుంచి సుమారు 12 బైకులను స్వాధీనం చేసుకుని, వాహన రికార్డులు తనిఖీ చేశారు. అదేవిధంగా నక్కల కాలనీ గ్రామ వాసులకు తగు సూచనలు ఇచ్చినట్లు ఎస్సై వెంకటసుబ్బయ్య తెలిపారు.