పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

SRPT: అనంతగిరి మండలం త్రిపురవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-07 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారి జ్ఞాపకాలను విద్యార్థులతో ఉపాధ్యాయులు పంచుకున్నారు.