భక్తులకు అన్నదానం కార్యక్రమం

కడప: మండల కేంద్రమైన ఒంటిమిట్ట సమీపంలోని కడప - చెన్నై జాతీయ రహదారి చెరువు కట్టపై వెలసిన కాశీ విశ్వేశ్వర స్వామికి సోమవారం విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకుడు స్వామివారికి అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం 200 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.