VIDEO: అకాల వర్షాలకు రోడ్డు పై నీరు.. విద్యార్దులు ఇక్కట్లు
ASR: అయినవిల్లి మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు పల్లపు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. మండలంలోని కె. జగన్నాధపురం గ్రామం చిన వీధి వీరభద్ర స్వామి ఆలయం వద్ద రోడ్డు పై వర్షపు నీరు నిలబడి ఉండడంతో గురువారం ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు నీటి లోంచి నడిచి వెళ్లాల్సి వచ్చింది. రహదారి మెరక పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.