VIDEO: దొడ్డిగుంట హత్య కేసులో నిందితులు అరెస్ట్
E.G: రంగంపేట మండలం దొడ్డిగుంటలో జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు రాజమహేంద్రవరం డీఎస్పీ విద్యా తెలిపారు. రంగంపేట పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నాగేంద్ర భార్య వీరలక్ష్మి వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తెలిపారు. అడ్డుగా ఉన్నాడని ప్రియుడు శివతో కలిసి వీరలక్ష్మి ఆమె భర్తను హత్య చేసినట్లు పేర్కొన్నారు.