పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

AP: రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, కృష్ణ, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలో రానున్న 2 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. గంటకు 60-85 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.